గురువారం 28 మే 2020
National - May 18, 2020 , 13:46:19

కేరళలో 20 నుంచి మద్యం అమ్మకాలు

కేరళలో 20 నుంచి మద్యం అమ్మకాలు

తిరువనంతపురం : కేరళలోని మందు ప్రియులకు భారీ ఊరట లభించింది. అయితే ఈ నెల 20వ తేదీ నుంచి వైన్‌ షాపులను తెరిచేందుకు అనుమతి ఇస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. క్షౌరశాలలకు కూడా అనుమతి ఇచ్చింది. కానీ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బ్యూటీ పార్లర్లు తెరవబడవు అని స్పష్టం చేసింది. సోమవారం ఉదయం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. లాక్‌డౌన్‌ సడలింపులపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించారు. పాఠశాల, కాలేజీ విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇంటర్‌ జిల్లాల్లో పర్యటించేందుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్‌ కాలంలో మద్యం షాపులకు అనుమతి ఇవ్వకపోవడం వల్ల రూ. 2,200 కోట్ల నష్టం వచ్చినట్లు అధికారులు తెలిపారు.


logo