మంగళవారం 14 జూలై 2020
National - Jun 22, 2020 , 15:30:00

ఆటోమేటిక్ థర్మల్ స్కానర్‌ను తయారు చేసిన విద్యార్థి

ఆటోమేటిక్ థర్మల్ స్కానర్‌ను తయారు చేసిన విద్యార్థి

తిరువనంతపురం: కేరళలోని కోచికి చెందిన ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థి ఆటోమేటిక్ థర్మల్ స్కానర్‌ను తయారు చేశాడు. కక్కనాడ్‌లోని రాజగిరి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన బిటెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి డివిన్స్ మాథ్యూ ఈ కొత్త పరికరాన్ని అభివృద్ధి చేశాడు. కంప్యూటర్ సైన్స్ విభాగం అధిపతి డాక్టర్ స్మిను ఇసుధీన్ ఆయనకు మార్గనిర్దేశం చేశారు. ఈ పరికరం మనుషుల శరీర ఉష్ణోగ్రతను రికార్డు చేయడంతోపాటు ఇందులోని కెమెరా ఆ వ్యక్తి ఫోటోను కూడా తీస్తుందని మాథ్యూ తెలిపాడు. అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్నవారిని ఫోటో తీసి వైఫై ద్వారా సంబంధిత అధికారికి సమాచారం అందిస్తుందని వివరించాడు. 

కరోనా నేపథ్యంలో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టులు, మాల్స్‌ వంటి బహిరంగ ప్రదేశాల్లో వీటిని సులువుగా ఏర్పాటు చేయవచ్చని  మాథ్యూ పేర్కొన్నాడు. దీని నిర్వహణకు వ్యక్తులతో పని లేదని, అది పంపే సమాచారాన్ని చూసుకుంటే సరిపోతుందని చెప్పాడు. ఈ ఆటోమేటిక్ థర్మల్ స్కానర్‌ తయారీకి రూ.4,000 ఖర్చు, మూడు వారాల సమయం పట్టిందని మాథ్యూ వివరించాడు. logo