ఆదివారం 31 మే 2020
National - May 10, 2020 , 15:42:42

కేరళలో నేడు పూర్తిగా లాక్‌డౌన్‌

 కేరళలో నేడు పూర్తిగా లాక్‌డౌన్‌

తిరువనంతపురం: మధ్యమధ్యలో తానున్నానంటూ కరోనా వైరస్‌ గుర్తుచేస్తుండటంతో.. కేరళ ప్రభుత్వం  కఠిన చర్యలకు పూనుకొన్నది. ఆదివారం  నాడు పూర్తిగా లాక్‌డౌన్‌ పాటించాలని ఈ మేరకు అధికారులకు సూచించడంతో తిరువనంతపురం సహా అన్ని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తున్నది. వాహనాలను రోడ్లపైకి రాకుండా కట్టుదిట్టం చేశారు. నిత్యావసర వస్తువుల దుకాణాలను ఉదయం కొంతసేపు అనుమతించిని అధికారులు, అనంతరం మూసివేయించారు. తిరువనంతపురంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి ఎడారిని తలపించాయి. అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతించారు. శుక్రవారం రెండు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో సీఎం విజయన్‌ కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. 


logo