శనివారం 16 జనవరి 2021
National - Dec 23, 2020 , 12:21:52

రైతు ఆందోళ‌న‌ల‌కు కేర‌ళ మ‌ద్ద‌తు : సీఎం విజ‌య‌న్‌

రైతు ఆందోళ‌న‌ల‌కు కేర‌ళ మ‌ద్ద‌తు :  సీఎం విజ‌య‌న్‌

హైద‌రాబాద్‌: కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళన 28 రోజుల‌కు చేరుకున్న‌ది. నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌కు సంఘీభావం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. రోజు రోజుకూ రైతు ధ‌ర్నాల‌కు మ‌ద్ద‌తు పెరుగుతోంద‌న్నారు.  రైతులు చేస్తున్న డిమాండ్ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ఆల‌కించాల‌న్నారు.  కొత్త రైతు చ‌ట్టాల‌ను త‌క్ష‌ణ‌మే ర‌ద్దు చేయాల‌ని సీఎం విజ‌య‌న్ కోరారు. రైతు ఆందోళ‌న విష‌యంలో కేర‌ళ ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని అనేక మంది ప్ర‌జ‌లు త‌మ‌ను ప్ర‌శ్నిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  ఒక‌వేళ దేశంలో ఆహార భ‌ద్ర‌త స‌మ‌స్య వ‌స్తే, అప్పుడు దాని ప్ర‌భావం కేర‌ళ‌పై అధికంగా ఉంటుంద‌న్నారు.  అందుకే కేర‌ళ కూడా ఈ నిర‌స‌న‌ల్లో పాల్గొంటుంద‌న్నారు. ఇవాళ తిరువ‌నంత‌పురంలో జ‌రిగిన రైతు ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో సీఎం విజ‌య‌న్ పాల్గొన్నారు.