వకీల్ సాబ్ కొత్త పోస్టర్ చూశాక ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. అభిమానులు మళ్లీ ఒక్కసారిగా జల్సా రోజుల్లోకి వెళ్లిపోయారు. 2008లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి మళ్లీ హిట్ రావడానికి ఏడేళ్లు పట్టింది. మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా కూడా నిరాశనే మిగిల్చాయి. జానీ, గుడుంబా శంకర్, బంగారం, అన్నవరం లాంటి సినిమాలు భారీ అంచనాలతో వచ్చి నిరాశ పరిచాయి. అలాంటి సమయంలో విడుదలైన జల్సా సినిమా మంచి విజయం అందుకుంది. దాదాపు రూ.35 కోట్ల షేర్ వసూలు చేసి పోకిరి తర్వాత స్థానాన్ని అందుకుంది. ఇదంతా ఇలా ఉంటే జల్సా పోస్టర్స్ అప్పట్లో ఒక సంచలనం.
ఆ సినిమా పాటలు.. కామెడీ సీన్స్.. డైలాగ్స్ ఇలా ప్రతి ఒకటి ఓ రేంజ్లో పేలాయి. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు ఏమేమి కోరుకుంటారో అని ఒక సినిమాతో ఇచ్చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మరీ బ్లాక్ బస్టర్ విజయం కాదు కానీ పవన్ అభిమానుల ఆకలి మాత్రం తీర్చింది జల్సా. మరీ ముఖ్యంగా జల్సా సినిమాలో ఒక పోస్టర్ ఇప్పటికీ అందరికీ బాగా గుర్తు. ఒక కాలు పైకెత్తి చేతిలో షర్ట్ పట్టుకొని పవన్ ఇచ్చిన స్టిల్ ఇప్పటికీ సంచలనమే.
దాదాపు13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈయన నటించిన వకీల్ సాబ్ సినిమాలో కూడా అలాంటి పోస్టర్ విడుదల చేశారు. అప్పుడు ఆయన వయసు లేట్ 30ల్లో ఉంది. కానీ ఇప్పుడు 50 దాటిపోయింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ అదే ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అద్భుతం. వకీల్ సాబ్ కొత్త పోస్టర్ లో ఏమాత్రం తేడా రాకుండా జల్సా రోజులను గుర్తు చేశాడు పవర్ స్టార్. అలాగే వకీల్ సాబ్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా అదిరిపోతాయని తెలుస్తోంది. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి