ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 12, 2020 , 08:08:26

కోజికోడ్‌ విమానాశ్రయం మూసివేత!

కోజికోడ్‌ విమానాశ్రయం మూసివేత!

తిరువనంతపురం : కేరళలోని కోజికోడ్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఇక్కడికి వచ్చే విమానాలన్నింటినీ కోచి అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. వందేభారత్‌ మిషన్‌లో భాగంగా దుబాయి నుంచి వచ్చిన ఏయిర్‌ ఇండియా విమానం ల్యాండ్‌ అవుతున్న తరుణంలో అదుపు తప్పి లోయలో జారిపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది వరకు మరణించారు. భారీ వర్షం కారణంగా విమానం ల్యాండ్‌ అవుతున్న క్రమంలో విమానం అదుపు తప్పి లోయలో పడి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ వర్షాకాలం సీజన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నందున ముగిసే వరకు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

దుబాయి నుంచి బయలుదేరిన ఏయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ గత శుక్రవారం రాత్రి భారీ వర్షాలకు ల్యాండింగ్‌ అయిన సందర్భంలో 190 మందితో కూడిన కోజికోడ్‌కు వస్తుండగా టేబుల్‌ టాప్‌ రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా అదుపు తప్పి 35 అడుగుల లోతు ఉన్న లోయలో పడింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్‌  ఇన్‌ కమాండ్‌ కెప్టెన్‌ దీపక్‌ సాతే, ఆయన కో పైలట్‌ అఖిలేష్‌కుమార్‌తో పాటు మొత్తం 20 మంది వరకు మరణించారు. ప్రమాద సమయంలో విమానంలో 10 మంది పిల్లలు, ఇద్దరు పైలట్లు, నలుగురు క్యాబిన్‌ సిబ్బంది సహా 190 మంది ఉన్నారని కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిని కేంద్ర ప్రభుత్వం ‘వందే భారత్‌ మిషన్‌’ కింద వారిని స్వదేశానికి తీసుకువస్తున్నది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo