గురువారం 28 జనవరి 2021
National - Dec 02, 2020 , 21:20:42

6316 కరోనా కేసులు.. 28 మరణాలు

6316 కరోనా కేసులు.. 28 మరణాలు

తిరువనంతపురం: కేరళలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో 6,316 కరోనా కేసులు, 28 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,14,673కు, మొత్తం మరణాల సంఖ్య 2298కి చేరింది. గత 24 గంటల్లో 5,924 మంది కరోనా రోగులు కోలుకున్నారు. దీంతో కేరళలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,50,788కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 61,455 యాక్టివ్‌ కేసులున్నట్లు పేర్కొంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo