తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. పక్షం రోజులుగా 20 వేల వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా యాక్టివ్ కేసులు 1.7 లక్షలకు పెరిగాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 21,445 కరోనా కేసులు, 160 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 36,31,638కు, మొత్తం మరణాల సంఖ్య 18,280కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 20,723 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 34,36,318కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,76,518 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 1,45,582 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.