e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జాతీయం కేరళలో నాలుగో రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు

కేరళలో నాలుగో రోజూ 20 వేలకుపైగా కరోనా కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. వరుసగా నాలుగో రోజు కూడా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా యాక్టివ్‌ కేసులు 1.6 లక్షలకు పెరిగాయి. గత రెండు నెలలుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. కాగా, గురువారం నుంచి శుక్రవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 20,772 కరోనా కేసులు, 116 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,70,137కు, మొత్తం మరణాల సంఖ్య 16,701కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 14,651 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 31,92,104కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,60,824 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana