e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home జాతీయం వామ్మో.. కేరళలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్నంటే!

వామ్మో.. కేరళలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.. తాజాగా ఎన్నంటే!

తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెలన్నర రోజులుగా ప్రతి రోజూ పది వేలకుపైగా పాజిటివ్ ‌కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. శుక్రవారం నుంచి శనివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 18,531 కరోనా కేసులు, 98 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,54,064కు, మొత్తం మరణాల సంఖ్య 15,969కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో 15,507 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 30,99,469కు చేరుకున్నదని, ప్రస్తుతం 1,38,124 యాక్టివ్ ‌కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్‌స్పాట్‌గా కేరళ కొనసాగుతున్నది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana