బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 18:40:01

కేరళలో కొత్తగా 16 పాజిటివ్‌ కేసులు

కేరళలో కొత్తగా 16 పాజిటివ్‌ కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 16  మందికి వైరస్‌ సోకిందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు.  కొత్తగా  వైరస్‌ సోకిన  16 మంది రోగుల్లో ఏడుగురు విదేశాల నుంచి తిరిగిరాగా..నలుగురు తమిళనాడు. ఇద్దరు ముంబై నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు సీఎం చెప్పారు. 

శుక్రవారం సాయంత్రం వరకు కేరళలో కరోనా కేసుల సంఖ్య  576కి చేరింది. ప్రస్తుతం 80 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టి వరకు 473 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు కేవలం నలుగురు మాత్రమే కరోనా వల్ల చనిపోయారు. కేరళలో 16 హాట్‌స్పాట్‌ ప్రాంతాలను గుర్తించారు. 


logo