శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 20:13:17

కేరళలో 24 గంటల్లో 1,310 కరోనా కేసులు

కేరళలో 24 గంటల్లో 1,310 కరోనా కేసులు

తిరువనంతపురం : కేరళ రాష్ట్రంలో కరోనా రోజురోజుకూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. నిత్యం వెయ్యికిపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో 1,310 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా ఇప్పటివరకు 23 వేలకుపైగా నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 13,027 మంది చికిత్సకు కోలుకోగా.. 10,495 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ల కారణంగా 70 మంది మృత్యువాత పడ్డారని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలాఉండగా దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 55,079 పాజిటివ్‌ కేసులు నమోదుకాగా శుక్రవారం వరకు 16 లక్షలకుపైగా  కేసులు నమోదయ్యాయి. 


logo