బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 02, 2020 , 19:52:22

కేర‌ళ‌లో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా విస్తృతి

కేర‌ళ‌లో ఇంకా త‌గ్గ‌ని క‌రోనా విస్తృతి

న్యూఢిల్లీ: కేర‌ళ‌లో క‌రోనా వైర‌స్ విస్తృతి ఇంకా త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ రోజుకు నాలుగు వేల‌కుపైగా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం రాత్రి వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 4,138 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అయితే కొత్త కేసుల కంటే ఎక్కువ‌గా రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 7,198 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. అదేవిధంగా గ‌త 24 గంట‌ల్లో 21 మంది క‌రోనా బాధితులు మృతిచెందారు. కాగా, కేర‌ళ‌లో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల‌లో క‌రోనా మ‌ర‌ణాల రేటు 0.34 శాతంగా ఉన్న‌ది. కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ఈ వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.