మంగళవారం 07 జూలై 2020
National - Mar 16, 2020 , 15:04:40

రెండ్రోజుల్లో 6వేల మాస్క్‌లు.. కేరళ ఖైదీల ఘనత!

రెండ్రోజుల్లో 6వేల మాస్క్‌లు.. కేరళ ఖైదీల ఘనత!

కరోనా వైరస్‌ రోజురోజుకూ ప్రపంచదేశాల్లో చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు వేలాది మంది ఈ మహమ్మారిభారిన పడిన సంగతి తెలిసిందే.  ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మాస్క్‌లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. మాస్క్‌ల కొరత కారణంగా వాటిని కొందరు బ్లాక్‌లో సైతం అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో కేరళకు చెందిన ఖైదీలు కరోనాను అరికట్టడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. రెండ్రోజుల్లో దాదాపు 6వేలకు పైగా కాటన్‌ మాస్క్‌లను కుట్టారు. ఈ విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్‌ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. వీటిని ఆరోగ్యశాఖకు అందిజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. రెండు లేయర్లు కలిగిన ఈ కాటన్‌ మాస్క్‌లను తిరిగి ఉపయోగించవచ్చు. వీటి ధర రూ.15 నుంచి రూ.20 వరకు నిర్ణయించారు.logo