బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 25, 2020 , 17:13:13

ఎస్పీ బాలు మృతికి కేర‌ళ ఘ‌న నివాళి

ఎస్పీ బాలు మృతికి కేర‌ళ ఘ‌న నివాళి

తిరువ‌నంతపురం: పాట‌ల రారాజు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతికి కేర‌ళ ప్ర‌భుత్వం ఘ‌నంగా నివాళులు అర్పించింది. కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌, గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మ‌ద్ ఖాన్ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతిప‌ట్ల సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు. ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఐదు భాష‌ల్లో గాయ‌కుడిగా, న‌టుడిగా ఓ గొప్ప వెలుగు వెలిగిన వ్య‌క్తి అని గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ ఖాన్ ట్వీట్ చేశారు. ఆయన అద్భుత స్వరానికి దేశంలోని కోట్ల మంది ప్రేక్ష‌కులు దాసులుగా మారార‌ని ఆయ‌న‌ పేర్కొన్నారు.

ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం మృతి భార‌త‌దేశ సంగీత ప్ర‌పంచానికి తీర‌ని లోటు అని కేర‌ళ సీఎం అభిప్రాయ‌ప‌డ్డారు. కేర‌ళ ప్ర‌జ‌లు ఆయ‌న‌ను బ‌య‌టి రాష్ట్ర‌పు వ్య‌క్తిగా చూడ‌ర‌ని, త‌మ సొంత మ‌నిషిలా భావిస్తార‌ని పేర్కొన్నారు. మ‌ధుర‌మైన స్వ‌రం, దివ్య‌మైన గాత్రంతో పాడిన పాట‌ల ద్వారా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం జ్ఞాప‌కాలు ఎల్ల‌ప్పుడూ మ‌న వెంటే ఉంటాయ‌ని విజ‌య‌న్ ట్వీట్ చేశారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo