శనివారం 31 అక్టోబర్ 2020
National - Sep 16, 2020 , 16:25:48

అచ్చం అలాగే చేద్దామనుకున్నాడు.. కానీ..!

అచ్చం అలాగే చేద్దామనుకున్నాడు.. కానీ..!

తిరువనంతపురం: కేరళలోని ఒక చిన్న ప్రదేశంలో తెల్లని ఇన్నోవాను ఒకరు సమాంతరంగా పార్క్‌ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటినుంచి చాలా మంది ప్రజలు దాన్ని అనుకరిస్తున్నారు. అదేచోటుకు వచ్చి తమ పార్కింగ్‌ నైపుణ్యాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే, ఇటీవల ఓ వ్యక్తి అదే ప్రదేశంలో తన పొడవైన నలుపురంగు సెడాన్‌ కారును పార్క్‌ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దీన్ని అక్కడే ఉన్నవారంతా వీడియో తీశారు. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 

మనంతవాడికి చెందిన పీజే బిబు తన ఇన్నోవా కారును ఎలా పార్క్‌ చేశాడో అలాగే చేసి, ఫేమస్‌ అయిపోదామని వచ్చాడు ఓ వ్యక్తి. అందరూ చూస్తుండగా తన సెడాన్‌కారును ముందుకు పోనిచ్చాడు. కొంచెం రివర్స్‌ తీసుకున్నాడు. మళ్లీ ముందుకు వెళ్లాడు. అనంతరం కారు ఎటూ కదలకుండా అయ్యేసరికి ప్రయత్నం విరమించుకున్నాడు. ఈ వీడియోను చూసి నెట్జిజన్లు నవ్వుకుంటున్నారు. ‘పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లు ఉంది.’ అంటూ ఒకరు కామెంట్‌ చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.