శనివారం 23 జనవరి 2021
National - Jan 12, 2021 , 14:45:20

ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారుకు కేర‌ళ వ్యాపార‌వేత్త బిడ్‌

ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ కారుకు కేర‌ళ వ్యాపార‌వేత్త బిడ్‌

కొచ్చి: అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడిన రోల్స్ రాయిస్ ఫాంట‌మ్ కారును కొన‌డానికి కేర‌ళకు చెందిన జువెల‌ర్ బాబీ చెమ్మ‌నూర్ బిడ్ వేస్తున్నారు. తాను బిడ్‌లో పాల్గొంటున్నాన‌ని, టెక్సాస్‌లోని త‌మ ఆఫీస్ ఇందుకు అవ‌స‌ర‌మైన ప్ర‌క్రియ‌ను ప్రారంభించింద‌ని బాబీ వెల్ల‌డించారు. ట్రంప్ ఖ‌రీదైన ల‌గ్జ‌రీ కారును అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్ట‌క ముందు వాడారు. అమెరికాకు చెందిన బిడ్డింగ్ వెబ్‌సైట్ మేక‌మ్ ఆక్ష‌న్స్ ఈ కారును వేలానికి పెట్టింది. 

ఎంత ప‌లుకుతుందో..?

ఇది 2010కి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ కారు. ట్రంప్ ఇప్ప‌టికే ఈ కారులో 91,249 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించారు. 2010 ప్రాంతంలో రోల్స్ రాయిస్ సంస్థ ఇలాంటి 537 కార్ల‌ను తయారు చేసింది. ఈ బిడ్‌లో గెలిచి కారును సొంతం చేసుకుంటాన‌ని బాబీ చెమ్మ‌నూర్ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ఈ కారు బేస్ ప్రైస్ రూ.3 కోట్లుగా ఉండొచ్చ‌ని అంచనా వేశారు. అయితే ఈ వేలంలో ఎంతోమంది కార్ ల‌వ‌ర్స్ పాల్గొంటార‌ని, అందువ‌ల్ల ఇది ఎంత ధ‌ర ప‌లుకుతుందో కూడా చెప్ప‌లేమ‌ని బాబీ చెప్పారు.


logo