గురువారం 09 జూలై 2020
National - Apr 08, 2020 , 00:41:37

పిల్లుల కోసమైతే ఓకే!

పిల్లుల కోసమైతే ఓకే!

-ఓ వ్యక్తికి కేరళ హైకోర్టు అనుమతి 

తిరువనంతపురం: పిల్లుల ఆకలి తీర్చటానికి లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి ఓ వ్యక్తికి కేరళ హైకోర్టు మినహాయింపునిచ్చింది. కొచ్చికి చెందిన ప్రకాశ్‌ అనే వ్యక్తి తన ఇంట్లో మూడు పిల్లులను పెంచుతున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వాటికి అవసరమైన బిస్కట్లను కొనుగోలు చేయటానికి వీలుగా తనకు నగరంలో ప్రయాణించటానికి అనుమతి ఇవ్వాలని అధికారులను ఆయన కోరారు. వారు తిరస్కరించారు. దీంతో ప్రకాశ్‌.. హైకోర్టులో పిటిషన్‌ వేశారు. హైకోర్టు ఆయనకు అనుమతినిస్తూ తీర్పు చెప్పింది.


logo