గురువారం 01 అక్టోబర్ 2020
National - Aug 03, 2020 , 14:59:42

బహిరంగ నిరసనలపై నిషేధం పొడిగించిన హైకోర్టు

బహిరంగ నిరసనలపై నిషేధం పొడిగించిన హైకోర్టు

తిరువనంతపురం: బహిరంగ ప్రాంతాల్లో నిరసనలపై నిషేధాన్ని కేరళ హైకోర్టు పొడిగించింది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రజా నిరసనలపై నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు సోమవారం తెలిపింది. తొలుత జూలై 31 వరకు నిషేధం విధిస్తూ గత నెల 15న కేరళ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బంగారం స్మగ్లింగ్‌ వ్యవహారం కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. సీఎం విజయన్‌కు ఇందులో సంబంధమున్నదని ఆ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన యూడీఎఫ్‌, బీజేపీ ఆరోపిస్తున్నాయి. తన పదవికి విజయన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బహిరంగ ప్రాంతాల్లో నిరసనలు నిర్వహించడంపై ఉన్న నిషేధాన్ని కేరళ హైకోర్టు ఈ నెలాఖరు వరకు పొడిగించింది. 


logo