మంగళవారం 02 జూన్ 2020
National - Apr 02, 2020 , 16:23:33

మద్యం అమ్మకాలపై కేరళ సర్కారుకు కోర్టులో చుక్కెదురు

మద్యం అమ్మకాలపై కేరళ సర్కారుకు కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: మద్యానికి బానిసైనవారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పై మద్యం అమ్మాలన్న కేరళ సర్కారు ప్రతిపాదనను కేరళ హైకోర్టు తిరకస్కరించింది. కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను న్యాయమూర్తులు ఏకే జయశంకరన్ నంబియార్, షాజీ పీ చాలీతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం, విపత్కరమైంది కూడా.. అని ధర్మాసనం పేర్కొన్నది. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్తలు, వైద్యులు, భారతీయ వైద్య సంఘం రాష్ట్ర విభాగం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. మందుబాబులు తాగడానికి మద్యం దొరకక తీవ్ర మానసిక సమస్యలకు లోనవుతున్నారన్న కారణంగా ప్రభుత్వం అమ్మకాలవైపు మొగ్గు చూపింది. ప్రభుత్వ ఉత్తర్వులను వైద్యులు, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించారు. కోర్టులో సర్కారు మందుబాబుల ఆత్మహత్య ఘటనలను ప్రస్తావించినప్పటికీ న్యాయమూర్తులు ఆ వాదనను అంగీకరించలేదు. లాక్‌డౌన్‌లో మద్యం అమ్మకాలను ససేమిరా అంగీకరించే ప్రసక్తే లేదని కోర్టు తేల్చి చెప్పింది.


logo