సోమవారం 30 మార్చి 2020
National - Feb 11, 2020 , 11:40:32

సీఏఏకు వ్యతిరేకంగా పెళ్లి కుమారుడి వినూత్న నిరసన

సీఏఏకు వ్యతిరేకంగా పెళ్లి కుమారుడి వినూత్న నిరసన

తిరువనంతపురం : పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం విదితమే. కేరళలోని వాజిముక్కు ప్రాంతానికి చెందిన ఓ పెళ్లి కుమారుడు.. సీఏఏకు వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన చేపట్టారు. పెళ్లి మండపానికి ఒంటెపై వచ్చిన వరుడు.. సీఏఏను తిరస్కరించండి.. ఎన్నార్సీ, ఎన్‌పీఆర్‌ను నిషేధించండి అని ప్లకార్డును ప్రదర్శించారు. ఇక పెళ్లి కుమారుడు హజా హుస్సేన్‌కు మద్దతుగా అతడి సహచరులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెళ్లి వేడుక సందర్భంగా వధువుకు వరుడు రాజ్యాంగ ప్రతిని బహుమతిగా ఇచ్చారు. సీఏఏను తిరస్కరించాల్సిందేనని హుస్సేన్‌ స్పష్టం చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేరళ అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే.


logo