గురువారం 25 ఫిబ్రవరి 2021
National - Jan 25, 2021 , 13:34:28

సీబీఐకి ఊమెన్‌ చాందీపై లైంగిక దాడి కేసు

సీబీఐకి ఊమెన్‌ చాందీపై లైంగిక దాడి కేసు

తిరువనంతపురం : కేరళలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పాలక ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ నేత ఊమెన్‌ చాందీ మరో ఐదుగురు నేతలపై నమోదైన లైంగిక దాడి కేసుల విచారణను సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది. గత యూడీఎఫ్‌ ప్రభుత్వంలో వెలుగుచూసిన సోలార్‌ ప్యానెల్‌ స్కామ్‌లో ప్రధాన నిందితురాలైన మహిళ 2012లో వీరు తనను లైంగికంగా వేధించారని గతంలో ఫిర్యాదు చేశారు. కాగా కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయ దురుద్దేశంతో తీసుకున్న చర్యని కాంగ్రెస్‌ తప్పుపట్టింది.

తమ పార్టీ నేతలపై ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమైన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం ఎన్నికలు దగ్గరపడటంతో తమను ఇరుకునపెట్టే నిర్ణయాలు తీసుకుంటోందని దుయ్యబట్టింది. మరోవైపు తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఊమెన్‌చాందీ స్పష్టం చేశారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం సీబీఐకి ఈ కేసులను అప్పగిస్తోందని విదేశీ వ్యవహారాల సహాయమంత్రి వి మురళీధరన్‌ ఆరోపించారు. 

VIDEOS

logo