ఆదివారం 24 జనవరి 2021
National - Dec 31, 2020 , 15:21:46

రాత్రి 10 గంటల వరకే న్యూ ఇయర్‌ వేడుకలు

రాత్రి 10 గంటల వరకే న్యూ ఇయర్‌ వేడుకలు

తిరువనంతపురం: కరోనా నేపథ్యంలో ఈసారి న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌పై పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. తాజాగా కేరళ ప్రభుత్వం కూడా ఈ జాబితాలో చేరింది. రాత్రి 10 గంటల వరకే కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతిస్తామని పేర్కొంది. ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడవద్దని సూచించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త రకం కరోనా వ్యాప్తి నేపథ్యంలో సంబంధిత నియంత్రణ మార్గదర్శకాలు పాటించకపోతే రాష్ట్రంలో వైరస్‌ కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నదని ప్రజలకు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జనమంతా కరోనా మార్గదర్శకాలు, ప్రభుత్వ ఆదేశాలను తప్పక పాటించాలని పేర్కొంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు గురువారం తాజా ఆదేశాలను కేరళ ప్రభుత్వం జారీ చేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo