గురువారం 24 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 13:38:05

రాజమాల ప్రాంతాన్ని సందర్శించిన కేరళ గవర్నర్, సీఎం

రాజమాల ప్రాంతాన్ని సందర్శించిన కేరళ గవర్నర్, సీఎం

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన రాజమాల ప్రాంతాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం సందర్శించారు. అక్కడ చేపడుతున్న సహాయక కార్యక్రమాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. గత శుక్రవారం ఇడుక్కి జిల్లాలోని రాజమాలలో కొండచరియలు విరిగి పడటంతో శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వెంటనే రంగంలోకి దిగి శిథిలాలను తొలగించే పనులు చేపట్టాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 55 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారాన్ని సీఎం విజయన్ ప్రకటించారు. కాగా ఒక రాష్ట్ర గవర్నర్, సీఎం కలిసి విపత్తు జరిగిన ప్రాంతాన్ని సందర్శించడం చాలా అరుదు.
logo