గురువారం 02 జూలై 2020
National - Jun 25, 2020 , 13:41:16

వ‌త్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సిలింగ్ : కేర‌ళ మంత్రి

వ‌త్తిడిలో ఉన్న విద్యార్థులకు కౌన్సిలింగ్ :  కేర‌ళ మంత్రి

హైద‌రాబాద్‌: కోవిడ్19 వ‌ల్ల విద్యార్థులు తీవ్ర మాన‌సిక వత్తిడిలోకి వెళ్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూత‌ప‌ప‌డం.. విద్యా సంవ‌త్స‌రాన్ని ఎప్పుడూ ఆరంభిస్తారో తెలియ‌క‌పోవ‌డంతో విద్యార్థులు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే తీవ్ర మాన‌సిక వ‌త్తిడికి గురి అవుతున్న విద్యార్థుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కేర‌ళ రాష్ట్ర ప్ర‌భుత్వం ఓ కొత్త ప్రాజెక్టును చేప‌ట్టింది.  కోవిడ్ వ‌ల్ల తీవ్ర వ‌త్తిడిలో ఉన్న వారికి కౌన్సిలింగ్ సేవ‌ల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య‌శాఖ‌ మంత్రి కేకే శైల‌జా తెలిపారు. వ‌త్తిడిలో ఉన్న వారికి ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తున్న‌ట్లు ఆమె తెలిపారు.  ఐసోలేష‌న్ వార్డుల్లో ఉన్న‌వారికి కూడా స‌ల‌హాలు, సూచ‌న‌లు చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. 

కేర‌ళ‌లో రాష్ట్ర‌వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 5 ల‌క్ష‌ల మందికి కోవిడ్ కౌన్సిలింగ్ ఇచ్చిన‌ట్లు మంత్రి శైల‌జా తెలిపారు.  ఇక విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా సైకోసోష‌ల్ ప్రాజెక్టును చేప‌ట్టిన‌ట్లు ఆమె చెప్పారు.  విద్యాశాఖ స‌హ‌కారంతో విద్యార్థుల‌కు కౌన్సిలింగ్ ఇవ్వ‌నున్నారు.  అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల ద్వారా ఫీల్డ్‌వ‌ర్క్ చేయిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. మాన‌సిక వ‌త్తిడిలో ఉన్న విద్యార్థుల‌కు ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. 1056 హెల్ప్‌లైన్ నంబ‌ర్ కూడా అందుబాటులో ఉంటుంద‌న్నారు.


logo