శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 11:11:32

బ‌ర్డ్‌ఫ్లూ భ‌యం.. వేల కోళ్లు హ‌న‌నం

బ‌ర్డ్‌ఫ్లూ భ‌యం.. వేల కోళ్లు హ‌న‌నం

హైద‌రాబాద్‌: వేల సంఖ్యలో కోళ్ల‌ను హ‌న‌నం చేసేందుకు కేర‌ళ ప్ర‌భుత్వం ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.  ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో బ‌ర్డ్ ఫ్లూ సోకిన‌ట్లు గుర్తించారు. దీంతో కోళ్ల‌ను హ‌న‌నం చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. అయితే పౌల్ట్రీల్లో ఉన్న కోళ్ల‌ను చంపేందుకు ప్ర‌భుత్వ అధికారులు కొన్ని ద‌ళాలను ఏర్పాటు చేశారు. ప‌ర‌ప్ప‌న‌గ‌డిలో ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఈ ప్ర‌క్రియ చేప‌ట్టారు. బ‌ర్డ్‌ఫ్లూ కేంద్ర బిందువైన ప్రాంతం నుంచి సుమారు కిలోమీటర్ దూరం వ‌ర‌కు ఉన్న అన్ని పౌల్ట్రీల్లో ఉన్న కోళ్ల‌ను హ‌న‌నం చేస్తున్న‌ట్లు డిసీజ్ ఇన్‌స్పెక్ష‌న్ ఆఫీస‌ర్ తెలిపారు.   


logo