శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 19:41:15

‘కరోనా’ ఫీజులను నిర్ణయించిన కేరళ సర్కారు

‘కరోనా’ ఫీజులను నిర్ణయించిన కేరళ సర్కారు

తిరువనంతపురం: కేరళలో ప్రైవేటు దవాఖానల్లో కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసుల చికిత్సల ధరలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కారుణ్య ఆరోగ్య సూరక్ష పధాతి (కేఏఎస్పీ) పథకం కింద రోగులకు ప్రభుత్వం సూచించిన మేరకు ప్రైవేటు ఆరోగ్య సంస్థలు చికిత్స అందిస్తాయి. ప్రైవేటు రంగంలో కొవిడ్‌-19 చికిత్సకు రేట్లు నిర్ణయించిన ఆరోగ్య శాఖ, కరోనావైరస్ చికిత్స అమలులో ప్రైవేట్ దవాఖానల భాగస్వామ్యం కోసం మార్గదర్శకాలను విడుదల చేసింది. అదే సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ ‘ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల కంటే ఏ ప్రైవేటు ఆసుపత్రి అదనపు పైసా వసూలు చేయకూడదని’ హెచ్చరించారు.

పీపీఈ కిట్లు, ఐసోలేషన్‌ కోసం యూనిట్‌కు రూ.1,000, జనరల్‌ వార్డుకు రూ.2,300, విత్‌ అవుట్‌ వెంటిలెటర్‌ ఐసీయూ రూ.6,500, వెంటిలేటర్‌తో ఐసీయూ రూ .11,500, హై డిపెండెన్సీ యూనిట్ (ఎక్కువ ఇంటెన్సివ్ అబ్జర్వేషన్, ట్రీట్మెంట్, నర్సింగ్ కేర్ అవసరమయ్యే వ్యక్తుల వార్డులు)కు రూ .3,300, ప్రైవేట్ ల్యాబ్‌ల్లో నమూనాలను పరీక్షించడానికి ఆర్టీ పీసీఆర్‌కు రూ.2,750 (ఓపెన్‌ సిస్టమ్‌), ప్రభుత్వం సూచించిన నమూనాలకు రూ.2500,  ఎక్స్‌పెర్ట్ నాట్ టెస్ట్  రూ.3,000, ట్రూ నాట్ టెస్ట్ స్టెప్-I  రూ.1,500, ట్రూ నాట్ టెస్ట్ స్టెప్-II (స్టెప్-I లో పాజిటివ్ పరీక్షించిన వారికి మాత్రమే) - రూ.1,500 వసూలు చేయాలని మంత్రి ఆదేశించారు. పథకానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులంటే జిల్లా కలెక్టర్‌ అధ్యక్షన ఉన్న జిల్లా గ్రీవెన్స్‌ పరిష్కార కమిటీ ఎదుట జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ ద్వారా లేవనెత్తవచ్చని తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo