సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 17:26:55

గోల్డ్ స్మగ్లింగ్ నిందితులకు ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం!

గోల్డ్ స్మగ్లింగ్ నిందితులకు ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం!

తిరువనంతపురం: కేరళలో కలకలం రేపిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులోని నలుగురు నిందితులకు ఉగ్రవాద ఆర్థిక కార్యకలాపాలతో సంబంధం ఉండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమానం వ్యక్తం చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు జరుగుతున్న కుట్రలో వీరికి పాత్ర ఉండవచ్చని వెల్లడించింది. ఇందులో భాగంగానే యూఏఈ నుంచి భారీగా బంగారాన్ని స్మగ్లింగ్ చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు స్వప్న, సందీప్ కలిసి కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఆరోపించింది.

కేటీ రమీశ్ దీనికి సూత్రధారి అని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఆ సంస్థ మంగళవారం కోచిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ నోట్‌లో పేర్కొంది. ఈ నేపథ్యంలో దీనిపై ప్రశ్నించేందుకు బంగారం అక్రమ రవాణాలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో రెండో వ్యక్తి అయిన స్వప్న సురేశ్, నాలుగో నిందితుడైన సందీప్ నాయర్ కస్టడీని పొడిగించాలని కోరింది. దీంతో వారిద్దరి కస్టడీని ఈ నెల 24 వరకు ఎన్ఐఏ కోర్టు పొడిగించింది.
logo