శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 18:32:57

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో మ‌రో ట్విస్ట్‌

కేర‌ళ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో మ‌రో ట్విస్ట్‌

తిరువ‌నంత‌పురం: కేర‌ళకు సంబంధించిన బంగారం అక్ర‌మ ర‌వాణా కేసులో మ‌రో మ‌లుపు చోటుచేసుకున్న‌ది. తిరువ‌నంత‌పురంలోని యూఏఈ రాయ‌బార కార్యాల‌యం గ‌న్‌మెన్ జ‌య‌ఘోష్ అదృశ్య‌మ‌య్యాడు. జ‌య‌ఘోష్ గ‌త రెండు రోజులుగా క‌నిపించ‌డం లేద‌ని అతని కుటుంబ‌స‌భ్యులు చెప్పారు. అయితే క‌నిపించ‌కుండా పోవ‌డానికి ముందు ఆయ‌న త‌న స‌ర్వీస్ పిస్తోల్‌ను సరెండ‌ర్ చేశాడ‌ని జ‌య‌ఘోస్ బావ తెలిపారు. 

జూలై 5న తిరువ‌నంతపు‌రం విమానాశ్ర‌యంలో క‌స్టమ్స్ అధికారులు బంగారాన్ని సీజ్ చేయ‌గానే కేసులో రెండో నిందితురాలిగా ఉన్న స్వ‌ప్న సురేష్ ప‌లుమార్లు జ‌య‌ఘోష్‌కు ఫోన్ చేసింద‌ని కుటుంబ‌స‌భ్యులు చెబుతున్నారు. బంగారం స్మ‌గ్లింగ్‌కు సంబంధించి జ‌య‌ఘోషే క‌స్ట‌మ్స్ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చాడ‌నే అనుమానంతో నిందితులు అత‌డిని బెదిరిస్తున్నార‌ని తెలిపారు. వారి నుంచి జ‌యఘోష్‌కు ప్రాణాపాయం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తంచేశారు. 

జూలై 5న తిరువ‌నంత‌పురం విమానాశ్ర‌యంలో సందీప్ నాయ‌ర్ అనే వ్య‌క్తి నుంచి 14.82 కోట్ల విలువచేసే 30 కేజీల అక్ర‌మ బంగారాన్ని సీజ్ చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి ఈ కేసులో స్వ‌ప్న సురేష్ అనే మ‌హిళ‌తో పాటు మ‌రో ముగ్గురికి సంబంధం ఉన్న‌ట్లు గుర్తించారు. అనంత‌రం అద‌రినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ బంగారం‌ పార్సిల్‌పై యూఏఈ దౌత్య అధికారి ర‌షీద్ ఖామిస్ పేరు ఉండ‌టంతో.. క‌స్ట‌మ్స్ త‌నిఖీల నుంచి త‌ప్పించుకోవ‌డం కోసం నిందితులు ప‌క్కా ప్లాన్ చేసి ఉంటార‌ని అధికారులు భావిస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo