మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 18:57:58

కస్టడీలో మానసికంగా హింసించారు: స్వప్న సురేశ్

కస్టడీలో మానసికంగా హింసించారు: స్వప్న సురేశ్

తిరువనంతపురం: ఎన్ఐఏ కస్టడీలో తనను మానసికంగా హింసించారని కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రెండో నిందితురాలైన స్వప్న సురేశ్ ఆరోపించారు. ఎన్ఐఏ కస్టడీ ముగియడంతో శుక్రవారం కోచిలోని ప్రత్యేక కోర్టులో అధికారులు ఆమెను హాజరుపర్చారు. ఈ సందర్భంగా స్వప్న సురేశ్ ఈ మేరకు ఆరోపించారు. మానసికంగా హింసించి తన స్టేట్‌మెంట్‌ను ఎన్ఐఏ అధికారులు నమోదు చేశారని కోర్టుకు తెలిపారు.

మరో నిందితుడు సందీప్ నాయర్ ఎన్ఐఏ కస్టడీ కూడా శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో వీరిద్దరితోపాటు ఈ కేసులో ప్రధాన నిందితుడైన సరిత్‌కు ఆగస్టు 21 వరకు జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు రిమాండ్ చేసింది. స్వప్న సురేశ్, సందీప్ నాయర్ బెయిల్ పిటిషన్లను ఆగస్టు 5న పరిశీలిస్తామని కోచిలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తెలిపింది.


logo