శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 21, 2020 , 19:16:14

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెయిల్‌కు దరఖాస్తు చేసిన స్వప్న సురేశ్

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బెయిల్‌కు దరఖాస్తు చేసిన స్వప్న సురేశ్

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలైన స్వప్న సురేశ్ బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. కోచిలోని ఎన్ఐఏ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కేంద్రం, రాష్ట్రం మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఈ కేసు పుట్టుకొచ్చిందని, మీడియా దీనికి మరింత రంగులు, అభూత కల్పనలు జోడించిందని స్వప్న సురేశ్ ఆరోపించారు. ఈ కేసులో చెబుతున్నదానికి, జరుగుతున్న పరిణామాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. బంగారం అక్రమ రవాణా ఆరోపణలతో తనకు ఎలాంటి సంబంధంలేదని బెయిల్ పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు. మరోవైపు స్వప్న సురేశ్ కస్టడీని ఎన్ఐఏ కోర్టు ఈ నెల 24 వరకు పొడిగించింది.


logo