ఆదివారం 12 జూలై 2020
National - Jun 04, 2020 , 13:34:07

ఇసుకతో ఏనుగుకు సంతాపం తెలిపిన ఆర్టిస్ట్‌

ఇసుకతో ఏనుగుకు సంతాపం తెలిపిన ఆర్టిస్ట్‌

కష్టకాలంలో ఉన్నవారికి సాయం చేస్తున్న వైద్యులను చూసి మానవత్వం ఇంకా బతికే ఉందనిపించింది. ఈ లోపే మనుషులకు అసలు మానవత్వమే లేదు అని నిర్థారణ అయిపోయింది. కేరళలో నిండు నెలలతో ఉన్న ఓ ఏనుగును పొట్టన పెట్టుకున్నారు రాక్షసులు. ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెడుతున్నారని ఆశగా వారి నుంచి పైనాపిల్‌ అందుకుంది. బిడ్డ ఆకలి తీరుస్తున్నాలే అనుకున్నది కాని మనిషిలో దాగున్న క్రూరత్వాన్ని అంచనా వేయలేకపోయింది. నోట్లో పెట్టుకున్న పైనాపిల్‌ పేలడంతో ఏనుగు బాధ వర్ణణాతీతం. కొన్ని రోజుల త‌ర్వాత‌ తల్లిబిడ్డ ప్రాణాలు ఈ నరరూప రాక్షస లోకాన్ని విడిచి గాలిలో కలిసిపోయాయి.

ఏనుగు చావుకు కారణం మనిషే. ఒక మనిషిగా సిగ్గుపడుతూ.. ఒడిశాలోని పూరీబీచ్‌లో తన శాండ్‌ ఆర్ట్‌తో ఏనుగుకు సంతాపం తెలియజేశాడు ప్రముఖ ఆర్టిస్ట్‌ సుదర్శన్‌ పట్నాయక్‌. ‘ఏనుగు చావుతోనే మానవత్వం కూడా చచ్చిపోయింది. దయచేసి మూగజీవాల ప్రాణాలతో చెలగాటమాడొద్దు. వాటిని సురక్షితంగా జీవించడానికి సహకరిద్దాం’ అనే క్యాప్షన్‌ను జోడించి తన బిడ్డతో ఉన్న ఏనుగు ఆర్ట్‌ను ట్విటర్‌లో షేర్‌ చేశాడు పట్నాయక్‌. దీని ద్వారా ఏనుగుకు సంతాపం తెలుపుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.logo