మంగళవారం 19 జనవరి 2021
National - Jan 05, 2021 , 12:36:29

బ‌ర్డ్‌ఫ్లూను రాష్ట్ర విపత్తుగా ప్ర‌క‌టించిన కేర‌ళ‌..

బ‌ర్డ్‌ఫ్లూను రాష్ట్ర విపత్తుగా ప్ర‌క‌టించిన కేర‌ళ‌..

తిరువ‌నంత‌పురం:  బ‌ర్డ్‌ఫ్లూగా పిలువ‌బ‌డే ఏవియ‌న్ ఇన్‌ఫ్లూయాంజాను కేర‌ళ ప్ర‌భుత్వం రాష్ట్ర విప‌త్తుగా ప్ర‌క‌టించింది.   కొట్టాయం, అల‌ప్పుజా జిల్లాల్లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఈ రెండు జిల్లాల్లో బ‌ర్డ్‌ఫ్లూ కేసులు న‌మోదు అయ్యాయి. వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయా జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు.  రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల్లోనూ హై అలర్ట్ ప్ర‌క‌టించారు. కొన్ని జిల్లాల్లో మ‌ర‌ణించిన బాతుల‌కు ప‌రీక్ష‌లు చేసిన త‌ర్వాత బ‌ర్డ్‌ఫ్లూ కేసులుగా నిర్ధారించారు. అయితే ఆ వ్యాధి జంతువుల నుంచి మ‌నుషుల‌కు సోక‌లేద‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.  రోగం గుర్తించిన బాతుల‌ను ఖ‌న‌నం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కొట్టాయం, అల‌ప్పుజా జిల్లాల్లో ఇన్‌ఫ్లూయాంజా ఏ వైర‌స్  H5N8ను గుర్తించారు. చ‌నిపోయిన బాతు శ్యాంపిళ్ల‌ను భోపాల్‌లోని ప్ర‌యోగ‌శాల‌కు పంపించారు. 8 ప‌క్షుల్లో అయిందింటిలో వైర‌స్ ఉన్న‌ట్లు ప‌సిక‌ట్టారు. కొట్టాయంలో ఓ రైతు వద్ద ఉన్న 8 వేల బాతుల్లో వైర‌స్ ఉన్న‌ట్లు నిర్ధారించారు.