సోమవారం 23 నవంబర్ 2020
National - Nov 02, 2020 , 12:56:36

వెడ్డింగ్ ఫోటోషూట్‌.. ఆన్‌లైన్ ట్రోలింగ్‌

వెడ్డింగ్ ఫోటోషూట్‌.. ఆన్‌లైన్ ట్రోలింగ్‌

హైద‌రాబాద్‌:  కొత్త జంట హ‌నీమూన్ ఎలా ఉంటుందో.. ఈ జంట త‌మ పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్‌లో చూపింది. కేర‌ళ‌కు చెందిన ఈ యువ జంట చేసిన వెడ్డింగ్ ఫోటోషూట్ తీవ్ర వివాదానికి దారి తీసింది.  హృషి కార్తీక్‌, ల‌క్ష్మిలు సెప్టెంబ‌ర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక ఓ టీ ప్లాంటేష‌న్‌లో హ‌నీమూన్ జ‌రుపుకున్నారు. వారి క‌లయిక‌ను ఓ మ‌ధుర‌జ్ఞాప‌కంగా మ‌లిచేందుకు ఫోటోషూట్ చేయించారు.  ఈ జంట ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన ఫోటోషూట్ ఫోటోలు ట్రోలింగ్‌కు గుర‌య్యాయి.  కేర‌ళ క‌పుల్‌పై ఆన్‌లైన్ వేధింపులు జోరుగా సాగాయి.  నిజానికి ఆ జంట పోస్టు చేసిన ఫోటోలు శృంగార‌భ‌రితంగా ఉన్నాయి. సిల్క్ దుస్తుల్లో కామోద్రేకాన్ని క‌లిగిస్తున్న రీతిలో వాళ్లు ఫోటోలు దిగారు. విభిన్న ర‌సాత్మ‌క భంగిమ‌ల్లో ఆ జంట దిగిన ఫోటోలు ఆన్‌లైన్ వీక్ష‌కుల‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.  న‌వ్వ‌డం, హ‌త్తుకోవ‌డం, ముద్దాడ‌డం వంటి శృంగార చేష్ట‌లు ట్రోల‌ర్స్‌ను అట్రాక్ట్ చేశాయి.  

లాక్‌డౌన్ వ‌ల్ల మ్యారేజీని గ్రాండ్‌గా చేసుకోలేక‌పోయారు.  దీంతో ఈ జంట త‌మ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను చిర‌స్మ‌ర‌ణీయంగా మార్చాల‌నుకున్నారు. అందుకే కొంత ఘాటు రీతిలో ఫోటోషూట్ చేశారు.  ల‌వ్ క‌మ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంట‌కు.. కుటుంబ‌స‌భ్యుల నుంచి ఎటువంటి ఇబ్బంది రాలేదు. కానీ ఆన్‌లైన్‌లో పోస్టు చేసిన ఫోటోలు మాత్రం వారిని వేధించేలా చేశాయి. ట్రోల‌ర్స్ చేస్తున్న కామెంట్స్‌.. ఓ ద‌శ‌లో ఈ జంట‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది. కొంద‌రి కామెంట్స్ వారికి ఉత్తేజాన్ని ఇచ్చాయి.  ఆన్‌లైన్ నుంచి ఆ ఫోటోల‌ను తీసివేయాల‌ని వాళ్ల‌కు ఎన్నో అభ్య‌ర్థ‌న‌లు వ‌చ్చాయి. కానీ ఈ క‌పుల్ మాత్రం ట్రోలర్స్‌తో పోరాడుతూనే ఉన్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో ఆ ఫోటోల‌ను ఆన్‌లైన్ నుంచి తొల‌గించేది లేద‌ని ఫిక్స్ అయ్యారు.  వెడ్డింగ్ ఫోటోషూట్ ట్రెండింగే అయినా.. ఇలాంటి ఫోటోలు ఓ కొత్త క‌ల్చ‌ర్‌ను ప్రమోట్ చేస్తున్నాయి.