శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 11, 2020 , 07:33:05

కరోనాను జయించింది!

కరోనాను జయించింది!
  • వైరస్‌ సోకిన తొలి భారతీయురాలికి
  • తాజాగా ‘కరోనా నెగెటివ్‌'
  • ప్రకటించిన కేరళ వైద్యాధికారులు

తిరువనంతపురం, ఫిబ్రవరి 10: ప్రపంచ దేశాలకు కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌ సోకి.. కేరళలోని త్రిచూర్‌ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న భారతదేశపు మొదటి కరోనా వైరస్‌ రోగి తాజా పరీక్షా ఫలితాలు ఆమె కోలుకుంటున్నట్టు సూచిస్తున్నాయి. జనవరి 30న చైనాలోని వుహాన్‌ నగరం నుంచి వచ్చిన భారత వైద్య విద్యార్థినికి పరీక్ష చేయగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఆమె రక్త నమూనాలను కేరళలోని జాతీయ వైరాలజీ విభాగానికి (ఎన్‌ఐవీ) పంపగా.. కరోనా నెగెటివ్‌గా వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. అయినప్పటికీ పుణెలోని ఎన్‌ఐవీ నుంచి వచ్చే రిపోర్టు కోసం వేచిచూస్తున్నామని చెప్పారు. కాగా కరోనా వైరస్‌ సోకినట్లు అనుమానం ఉన్న 3,252 మందిని అబ్జర్వేషన్‌లో ఉంచినట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. 
logo