గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 07:14:51

సోషల్‌మీడియాలో మహిళల్ని వేధిస్తే కఠిన చర్యలు: కేరళ సీఎం

సోషల్‌మీడియాలో మహిళల్ని వేధిస్తే కఠిన చర్యలు: కేరళ సీఎం

తిరువనంతపురం: సోషల్‌ మీడియాలో మహిళలపై దుర్భాషలాడితే కఠినచర్యలు తీసుకుంటామని కేరళ సీఎం పినరాయి విజయన్‌ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేసేందుకు వెనుకాడొద్దని పోలీసులుకు సీఎం సూచించారు. సామాజిక మధ్యమాలు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మలయాళ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ భాగ్యలక్ష్మితోపాటు పలువురు మహిళా సామాజిక కార్యకర్తల మీద ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై కేరళలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. సదరు వ్యక్తిని పోలీసులు సోమవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo