బుధవారం 15 జూలై 2020
National - Jun 24, 2020 , 13:53:31

స‌మూహ వ్యాప్తి జ‌రుగుతుందేమో : కేర‌ళ సీఎం

 స‌మూహ వ్యాప్తి జ‌రుగుతుందేమో :  కేర‌ళ సీఎం

హైద‌రాబాద్‌: కేర‌ళ‌లో క‌రోనా వైర‌స్ స‌మూహ వ్యాప్తి జ‌రుగుతుందేమో అని ఆ రాష్ట్ర సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.  రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల గురించి ప్ర‌స్తావిస్తూ.. ఎటువంటి ఆన‌వాళ్లు లేని కేసుల సంఖ్య పెరుగుతున్న‌ద‌న్నారు.  మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఈ అనుమానాలు వ్య‌క్తం చేశారు.  రాష్ట్రంలో ప‌రిస్థితి దారుణంగా త‌యారైంద‌న్నారు.  ఎటువంటి ల‌క్ష‌ణాలు లేని కేసులు విప‌రీతంగా పెరుగుతున్నాయ‌న్నారు.  ఇన్‌ఫెక్ష‌న్ సోర్స్ తెలియ‌ని కేసుల సంఖ్య కూడా అధిక‌మైన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ల‌క్ష‌ణాలు లేని కేసుల‌తో స‌మ‌స్య ఏమీ లేద‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ కేసుల్లో 60 శాతం మందికి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌న్నారు. పాజిటివ్ వ‌చ్చిన కేవ‌లం 20 శాతం మందిలో మాత్ర‌మే కోవిడ్ ల‌క్ష‌ణాలు స్వ‌ల్పంగా క‌నిపిస్తున్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. బ‌య‌ట మాత్ర‌మే కాదు, ఇండ్ల‌లోనూ ఉన్న‌వారు కూడా మాస్క్‌లు ధ‌రించి, సోష‌ల్ డిస్టాన్స్ పాటించాల‌న్నారు. logo