ఆదివారం 05 జూలై 2020
National - Jun 15, 2020 , 20:37:33

సీపీఐ -ఎం యూత్‌ లీడర్‌తో కేరళ సీఎం కూతురి పెళ్లి

సీపీఐ -ఎం యూత్‌ లీడర్‌తో కేరళ సీఎం కూతురి పెళ్లి

తిరువనంతపురం: కేరళ సీఎం పినరయి విజయన్‌ కూతురు వీణ వివాహం డీవైఎఫ్‌వై ఆల్‌ ఇండియా ప్రెసిడెంట్‌ మహ్మద్‌ రియాజ్‌తో సోమవారం జరిగింది. అతికొద్ది మంది అతిథుల సమక్షంలో సీఎం అధికారిక నివాసంలో సాదాసీదాగా పెళ్లితంతు జరిపించారు.

కాగా, ఇది వారిద్దరికీ ఇది రెండో వివాహం. రియాజ్‌ తన మొదటి భార్యతో, వీణ తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారు. రియాజ్‌కు ఇద్దరు పిల్లలు, వీణకు ఒక కొడుకు ఉన్నారు.  లాయర్‌ అయిన రియాజ్‌ 2009 ఎన్నికల్లో కోజికోడ్‌ లోక్‌సభా స్థానానికి పోటీచేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. వీణ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నడుపుతున్నది. 

 logo