టీకా ముడిపదార్థాలపై ఆంక్షలు ఎత్తివేయలేం: అమెరికా
వాషింగ్టన్: కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని అమెరికా సమర్థించుకున్నది. అమెరికన్ల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని పేర్కొంది. ముడిపదార్థాల ఎగుమతులపై విధించిన ఆంక్షలను ఎత్తివేయలేమని తేల్చిచెప్పింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ప్రైస్ గురువారం వెల్లడించారు. కరోనా టీకాల ఉత్పత్తికి అవసరమైన ముడిపదార్థాలపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత్లో వ్యాక్సిన్ ఉత్పత్తి నెమ్మదించింది.