శనివారం 16 జనవరి 2021
National - Dec 22, 2020 , 23:17:43

కేరళ అసెంబ్లీ ప్రత్యేక భేటీకి గవర్నర్‌ నో.. సీఎం విజయన్‌ ఫైర్‌

కేరళ అసెంబ్లీ ప్రత్యేక భేటీకి గవర్నర్‌ నో.. సీఎం విజయన్‌ ఫైర్‌

తిరువనంతపురం: మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను తిరస్కరించేందుకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించడానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు గవర్నర్‌ అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ మంగళవారం ప్రకటించారు. దీనిపై సీఎం పినరయి విజయన్‌ మండిపడ్డారు. గవర్నర్‌ చర్య రాజ్యాంగానికి వ్యతిరేకం అని అభిప్రాయ పడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రభుత్వ సిఫారసును తిరస్కరించడానికి గవర్నర్‌కు అధికారం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రైతుల ఆవేదనను వినాలని విజయన్‌ కోరారు. 
అత్యవసరంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సిన అవసరమేమిటో తెలియజేయాలని సీఎం నుంచి గవర్నర్‌ వివరణ కోరినట్లు సమాచారం. గవర్నర్‌ నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. ప్రత్యేక సమావేశాల నిర్వహణకు పిలుపునివ్వడం చౌకబారు రాజకీయం అని బీజేపీ నేత వీ మురళీధరన్‌ అన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.