శనివారం 04 జూలై 2020
National - Jun 16, 2020 , 01:41:59

డీవైఎఫ్‌ఐ నేతతో కేరళ సీఎం కూతురు వివాహం

డీవైఎఫ్‌ఐ నేతతో కేరళ సీఎం కూతురు వివాహం

తిరువనంతపురం: కేరళ సీఎం పినరాయి విజయన్‌ కూతురు వీణ వివాహం, సీపీఎం యువజనసంఘం డీవైఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షుడు మహమ్మద్‌ రియాజ్‌తో జరిగింది. విజయన్‌ అధికార నివాసంలో కరోనా మార్గదర్శకాలకనుగుణంగా సోమవారం సాదాసీదాగా జరిగిన ఈ వివాహానికి సన్నిహిత బంధు మిత్రులు 50 మందిలోపే హాజరయ్యారు. వీణ.. బెంగళూరులో 2015లో ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్‌ అనే ఐటీ సంస్థను ప్రారంభించి, నిర్వహిస్తున్నారు. వారిద్దరికీ ఇది రెండో వివాహం. కాగా, ఈ వివాహాన్ని గత వారం ప్రత్యేక వివాహాల చట్టం కింద రిజిస్టర్‌ చేశారు. logo