శుక్రవారం 10 జూలై 2020
National - Jun 23, 2020 , 13:55:32

దుబాయ్‌కు విమానాలు పునరుద్ధరించండి.. మోదీకి కేరళ సీఎం ఈమెయిల్‌

దుబాయ్‌కు విమానాలు పునరుద్ధరించండి..  మోదీకి కేరళ సీఎం ఈమెయిల్‌

తిరువనంతపురం: దుబాయ్‌కు విమానాలను పునరుద్ధరించాలని కేరళ సీఎం వినరయి విజయన్‌ ప్రధాని నరేంద్ర మోదీకి ఈమెయిల్‌ రాశారు. కరోనా వల్ల విదేశాల్లో చిక్కుకున్నవారిని ఈ నెల 22 నుంచి దుబాయ్‌ అనుమతిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్‌తోపాటు గల్ప్‌ దేశాల్లో పనిలో తిరిగి చేరేందుకు కేరళీయులు ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలించి దుబాయ్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను పునరుద్ధరించాలని ప్రధాని మోదీని విజయన్‌ కోరారు. ఈ మేరకు పౌర విమాన మంత్రిత్వ శాఖకు ఆదేశాలని జారీ చేయాలని ఆయన సూచించారు. మరోవైపు విదేశాల్లో చిక్కుకున్న కేరళీయులను రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలంటూ విపక్ష నేత రమేశ్‌తో పాటు ఇతర నేతలు ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. 
logo