మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 16:17:59

కేరళ అసెంబ్లీ సమావేశాలు రద్దు

కేరళ అసెంబ్లీ సమావేశాలు రద్దు

తిరువనంతపురం: కేరళలో ఈ నెల 27 నుంచి జరుగాల్సిన అసెంబ్లీ సమావేశాలు రద్దయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. గురువారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానించింది. మరోవైపు కేరళలో రాష్ట్రవ్యాప్తంగా పూర్తిగా లాక్‌డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నది. సోమవారం జరుగనున్న ప్రత్యేక క్యాబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నది.

తిరువనంతపురంలోని తీర ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నది. ఈ ప్రాంతంలో వైరస్ సామూహిక వ్యాప్తి దశకు చేరిందన్న అనుమానాన్ని సీఎం విజయన్ ఇటీవల వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తిరువనంతపురం పరిధిలోని ప్రాంతాల్లో లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. కరోనా కేసుల నమోదులో మార్పు‌లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కేరళలో కరోనా కేసుల సంఖ్య 15 వేలు దాటగా, ఇప్పటి వరకు 44 మంది మరణించారు.logo