గురువారం 02 జూలై 2020
National - Apr 18, 2020 , 14:39:38

లాక్‌డౌన్ పెళ్లి.. 130 కిలోమీట‌ర్లు కారు న‌డిపిన వ‌ధువు

లాక్‌డౌన్ పెళ్లి.. 130 కిలోమీట‌ర్లు కారు న‌డిపిన వ‌ధువు


హైద‌రాబాద్‌: లాక్‌డౌన్ వేళ అన్నీ ఆంక్ష‌లే. అయినా కొన్ని చోట్ల పెళ్లిల్లు ఆగ‌డం లేదు.  కేర‌ళ‌లో ఓ వ‌ధువు.. అత్త‌వారింటికి వెళ్లేందుకు త‌న భ‌ర్త‌ను కారులో కూర్చోపెట్టుకుని సుమారు 130 కిలోమీట‌ర్లు కారు న‌డిపింది.  ఎర్నాకుళంకు చెందిన అమ్మాయి స‌నాట‌, పాల‌క్కాడ్‌కు చెందిన అబ్బాయి గిను మ‌ధ్య శుక్ర‌వారం పెళ్లి జ‌రిగింది. వీరి పెళ్లికి అతిథులు పెద్ద‌గా హాజ‌రుకాలేరు. లాక్‌డౌన్ ఆంక్ష‌ల నేప‌థ్యంలో.. ప్ర‌త్యేక వాహ‌నాన్ని కూడా వాళ్లు మాట్లాడుకోలేదు. పెళ్లి అయిన వెంట‌నే.. వ‌ధువు స‌నాట కారు డ్రైవింగ్ చేస్తూ అత్త‌వారింటికి వెళ్లింది. భ‌ర్త‌ను వెంట పెట్టుకుని పెళ్లి దుస్తుల‌తోనే ఆమె కారు న‌డింది. సుమారు 4 గంట‌ల్లో వాళ్లు పాలక్కాడ్ చేరుకున్నారు. అత్తారింటికి భ‌ర్త‌ను తీసుకువెళ్ల‌డం థ్రిల్లింగ్‌గా ఉంద‌ని ఆమె అన్న‌ది. ఇక ఎర్నాకుళంలోని మ‌రో జంట‌.. వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా నిశ్చితార్థం జ‌రుపుకున్నారు. వాస్త‌వానికి భారీగా ఈ ఈవెంట్‌ను నిర్వ‌హించాల‌నుకున్నారు. కానీ లాక్‌డౌన్ ఆంక్ష‌ల వ‌ల్ల అలా చేయ‌లేక‌పోయారు. అయితే పెళ్లి క‌ట్నాల‌ను మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వ‌నున్న‌ట్లు ఆ ఫ్యామిలీ పేర్కొన్న‌ది.

logo