గురువారం 09 జూలై 2020
National - Jun 14, 2020 , 19:48:18

కేరళ బాలుడు.. బైక్‌ తయారు చేశాడు

కేరళ బాలుడు.. బైక్‌ తయారు చేశాడు

తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ బాలుడు తేలికపాటి బైక్‌ను తయారు చేశాడు. కోచికి చెందిన అర్షద్ 9వ తరగతి చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటున్న అతడు ఏదో ఒకటి చేయాలని భావించాడు. తన తండ్రికి చెందిన ఆటోమొబైల్‌ వర్క్‌ షాప్‌లోని పనికిరాని వస్తువులను సేకరించాడు. వాటిని ఓ పాత సైకిల్‌కు బిగించి చిన్న బైక్‌ తయారు చేశాడు. దీనిపై ఒక లీటరు పెట్రోల్‌తో గంటకు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని అర్షద్‌ చెబుతున్నాడు. ఈసారి నాలుగు చక్రాలతో నడిచే వాహనాన్ని తయారు చేస్తానని అతడు పేర్కొన్నాడు. logo