శనివారం 04 జూలై 2020
National - Jun 26, 2020 , 09:40:04

రైల్వే మంత్రిత్వ‌శాఖను ఆక‌ట్టుకున్న12 ఏండ్ల కుర్రాడు!

రైల్వే మంత్రిత్వ‌శాఖను ఆక‌ట్టుకున్న12 ఏండ్ల కుర్రాడు!

లాక్‌డౌన్‌లో చాలామంది పిల్ల‌లు త‌మ స‌మ‌యాన్ని వృధా చేసుకుంటున్నారు. కొంత‌మంది మాత్రం త‌ల్లిదండ్రుల సాయంతో మెద‌డుకు ప‌దును పెడుతున్నారు. రోజులు ఎక్కువైనా ప‌ర్వాలేదు ప్రాజెక్ట్ బాగా రావాలి అని ప‌ట్టుద‌ల‌తో ప్ర‌యోగాలు చేస్తున్నారు చిన్నారులు. క‌రోనా వైర‌స్ వ‌ల్ల స్కూల్‌లో పాఠాలు విన‌లేక‌పోతున్నారు కాని మెద‌డు మాత్రం ఖాళీగా లేదు. కేర‌ళ‌కు చెందిన 12 ఏండ్ల కుర్రాడు త‌యారు చేసిన రైలు ప్రాజెక్ట్ రైల్వే మంత్రిత్వ‌శాఖను ఆక‌ట్టుకున్న‌ది. ఇంత‌కీ ఈ రైలు ఎలా త‌యారు చేశాడు. ఎన్నిరోజులు ప‌ట్టింది అనేగా మీ సందేహం. 

ఈ రైలు త‌యారు చేయ‌డానికి పెద్ద‌గా ఖ‌ర్చు అవ‌స‌రం లేదు. వ‌స్తువుల‌ను స‌మ‌కూర్చుకునే ప‌నికూడా లేదు. ఇంట్లో న్యూస్ పేప‌ర్స్‌, గ్లూ ఉంటే స‌రిపోతుంది. అన్నింటికి మించి ఓపిక ఉంటే చాలంటున్నాడు మాస్టర్ అద్వైత్ కృష్ణ. కేవ‌లం మూడురోజుల్లోనే 33 వార్తా ప‌త్రిక‌లు, A4 షీట్లు ప‌ది ఉప‌యోగించి అద్భుత‌మైన రైలును సృష్టించాడు. లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉంటూ ఇలాంటి ప్రాజెక్ట్‌లు చేస్తూ అంద‌రి ప్ర‌సంశ‌లు పొందుతున్నాడు కృష్ణ‌. రైలును త‌యారు చేస్తున్న వీడియోతో పాటు ప్రాజెక్ట్ గురించి కొన్ని విష‌యాల‌ను మంత్రిత్వ శాఖ ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు. కొద్ది క్ష‌ణాల‌కే ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. logo