శుక్రవారం 05 జూన్ 2020
National - May 13, 2020 , 21:37:22

నాతో ఆడుకోవట్లేదు.. అరెస్ట్‌ చేయండి

నాతో ఆడుకోవట్లేదు.. అరెస్ట్‌ చేయండి

కోజికోడ్‌: మా పెద్దక్కతోపాటు మరో నలుగురు అమ్మాయిలు తనతో ఆడుకోవడం లేనందున వారిని అరెస్ట్‌ చేసి తగు చర్యలు తీసుకోవాలంటూ కేరళ కోజికోడ్‌కు చెందిన ఎనిమిదేండ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదుచేశాడు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో అందరం ఇంటిపట్టునే ఉంటున్నామని, అయితే అక్కతోపాటు మరో నలుగురు తనను వారితో ల్యూడో, దొంగ పోలీస్‌, షటిల్‌ బ్యాడ్మింటన్‌ ఆడనివ్వడం లేదని కోజికోడ్‌కు చెందిన బాలుడు ఉమర్‌ నాయర్‌ పోలీసులకు చెప్పాడు. దాంతో కస్బా పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారులు ఉమేశ్‌, కేటీ నీరజ్‌.. ఆ బాలుడి ఇంటికి వచ్చి అమ్మాయిలతో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది. 


logo