సోమవారం 06 జూలై 2020
National - Jun 03, 2020 , 12:48:38

ఆటోడ్రైవర్‌ ఔదార్యం చూడండి!

ఆటోడ్రైవర్‌ ఔదార్యం చూడండి!

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు ఇన్నిరోజులు లాక్‌డౌన్‌ను ఫాలో అయ్యాం. అయినటప్పటికీ కొంతమంది అజాగ్రత్త వల్ల కరోనా వ్యప్తిని అరికట్టలేక పోయాం. దీంతో లాక్‌డౌన్‌ను ఎత్తేయక తప్పలేదు. బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు అన్నీ తిరుగుతున్నాయి. వాహనాలు, కార్యాలయాలన్నింటికీ ఉదయాన్నే శానిటైజింగ్‌ చేస్తున్నారు. ఇది మాత్రం ఎంతసేపు ఉంటుంది. అందుకే ప్రయాణికులు బ్యాగులో శానిటైజర్‌ను క్యారీ చేస్తూ తరచూ చేతులు శుభ్రంగా ఉంచుకుంటున్నారు. కొంతమంది ఈ జాగ్రత్తలు ఏవీ తీసుకోవడం లేదు. ఇటీవల ఓ క్యాబ్‌ డ్రైవర్‌కు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలిసిందే.

కేరళకు చెందిన ఆటో డ్రైవర్‌ తన రక్షణతో పాటు పాసింజర్ల రక్షణ కోరుకుంటున్నాడు. అందుకని సబ్బునీళ్ల బాటిల్‌ను ఆటోకు కనెక్ట్ చేశాడు. ఆటో ఎక్కే వారందరినీ సబ్బునీటితో చేతులు శుభ్రం చేపించి మరీ ఎక్కించుకుంటున్నాడు. ఈ సంఘటన సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోను పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్‌ చాలామందికి ఆదర్శంగా మారుతున్నాడు.logo