సోమవారం 30 మార్చి 2020
National - Mar 13, 2020 , 14:34:56

కరోనాను విపత్తుగా ప్రకటించిన ఒడిశా

కరోనాను విపత్తుగా ప్రకటించిన ఒడిశా

తిరువనంతపురం/భువనేశ్వర్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా వైరస్‌ను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా ప్రభావంతో కేరళ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 8వ తేదీ వరకు కేరళ అసెంబ్లీ కొనసాగాల్సి ఉంది. కరోనా వైరస్‌ను విపత్తుగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. అసెంబ్లీని కూడా మార్చి 29 వరకు వాయిదా వేసినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు. కేరళ, ఒడిశాతో పాటు ఉత్తరప్రదేశ్‌లో మార్చి 31వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. సినిమా హాళ్లను మూసివేశారు. 


logo