ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Aug 23, 2020 , 21:45:40

ద‌శ‌ల వారీగా మెట్రో రైలు స‌ర్వీసుల‌ను న‌డ‌పాలి : సీఎం కేజ్రీవాల్

ద‌శ‌ల వారీగా మెట్రో రైలు స‌ర్వీసుల‌ను న‌డ‌పాలి : సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ : ద‌శ‌ల వారీగా మెట్రో రైలు స‌ర్వీసుల‌ను తిరిగి ప్రారంభించే అంశాన్ని ప‌రిశీలించాల్సిందిగా ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఆదివారం నాడు కోరారు. కోవిడ్‌-19 ప‌రిస్థితి ఢిల్లీలో ప్ర‌స్తుతం అదుపులోనే ఉంద‌ని తెలిపారు. ఈ నేప‌థ్యంలో మెట్రో స‌ర్వీసుల‌ను ద‌శ‌ల వారీగా న‌డిపే అంశాన్ని ప‌రిశీలించాల్సిందిగా విన్న‌వించారు. మార్చి 22వ తేదీ నుంచి ఢిల్లీ మెట్రో స‌ర్వీసు సేవ‌లు నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా ప‌రిస్థితి అదుపులోకి వ‌చ్చిన ఈ ప‌రిస్థితుల్లో కేంద్రం ఆలోచించాల్సిందిగా కోరారు. ఢిల్లీ ఆర్థిక వ్య‌వ‌స్థ పెంపుద‌ల‌కు ఆదివారం కేజ్రీవాల్‌ వ్యాపార వ‌ర్గాల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఢిల్లీ వాసుల స‌హ‌కారం ప‌ట్ల తాను సంతోషంగా ఉన్న‌ట్లు కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ ప్ర‌భుత్వం కోవిడ్‌ను ఎదుర్కొంటున్న తీరును దేశం అదేవిధంగా ప్ర‌పంచం నేడు చూస్తుంద‌ని తెలిపారు. logo